‘SSMB28’ అనుకున్న సమయంలోనే పూర్తయ్యేలా ప్లాన్.. కానీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.

ఇది రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న మొన్నటి దాకా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.ఇక ఎట్టకేలకు స్టార్ట్ అయ్యి రెగ్యురల్ షూట్ కూడా మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసారు.

ఇక కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు మహేష్ కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

సెకండ్ షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్న సమయంలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించింది.

ఇక కొద్దిరోజులు మహేష్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు.ఇక మహేష్ కొద్దిగా సెట్ అయ్యాడు అని మళ్ళీ సెట్స్ మీదకు వెళుతుంది అనే టైం లో మళ్ళీ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మరో సారి బ్రేక్ వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను డిసెంబర్ తొలి వారంలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.

"""/"/ మరి ఈసారి షెడ్యూల్ స్టార్ట్ అయితే అస్సలు బ్రేక్ లేకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

ప్లాన్ ప్రకారం అయితే ఫిబ్రవరి నాటికీ షూట్ పూర్తి చేసి మార్చి మొత్తం కూడా ప్రొమోషన్స్ చేసి ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ లో తీసుకు రావాలని అనుకున్నారట.

కానీ ఇప్పుడు కూడా కాస్త ఆలస్యంగా అయిన పూర్తి చేసే ఛాన్స్ ఉంది.

దీంతో కొద్దిగా రిలీజ్ డేట్ అటూ ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అని ఎప్పుడో ఫిక్స్ చేసారు.

అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

రైలు డోర్ తెరుచుకోక పోవడంతో చేతికర్రతో పగలగొట్టిన వికలాంగుడు.. చివరకు? (వీడియో)