నేను రణబీర్ కు పెద్ద ఫ్యాన్.. మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ''యానిమల్''( Animal Movie ).

ఈ తెలుగు డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం వల్ల ఈ సినిమాపై సౌత్ వారు కూడా ద్రుష్టి పెట్టారు.

ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే అంచనాలు పెంచేసుకున్నారు.బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న 'యానిమల్' సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకోగా ప్రమోషన్స్ తో ఆ అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి.

ఇటీవలే ట్రైలర్ రిలీజ్ తో అంచనాలు మరింత పెరిగాయి. """/" / ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ అంత బిజీ బిజీగా ఉన్నారు.

తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ నిన్న రాత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరుగగా ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అగ్ర డైరెక్టర్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు.

మరి ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ.''నేను రణబీర్ కపూర్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు.

ఈయన సినిమాలు చూసింది కొన్నే అయినప్పటికీ ప్రతీ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడని.

ఇక యానిమల్ ట్రైలర్ చూసాక పిచ్చెక్కిందని చెప్పుకొచ్చారు.సందీప్ వంగ, రణబీర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి అద్భుతమైన నటులు ఎంతో కష్టపడ్డ ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవాలని చెప్పుకొచ్చారు.

"""/" / కాగా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

మరి ఈ సినిమా తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

కెమెరాకు చిక్కిన రాక్షస మొసలి లాంటి చేప.. వీడియో వైరల్..