మహేష్ లెగసీని గౌతమ్ ముందుకు నడిపించడం ఖాయం.. ఇదే సాక్ష్యం!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని సరిగ్గా వంటబట్టించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.

ఈయన ఇప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ హీరోల లిస్టులో టాప్ లో ఉన్నాడు.

ఇక మహేష్ బాబు లెగసీని ముందుకు నడిపించేందుకు ఆయన కుమారుడు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడా లేదా అనే చర్చ అప్పుడప్పుడు అభిమానుల్లో వస్తూనే ఉంటుంది.

అయితే ప్రెజెంట్ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే మహేష్ లెగసీని ముందుకు నడిపించే సామర్థ్యం గౌతమ్ ఘట్టమనేనికి ఉంది అని వార్తలు వస్తున్నాయి.

ఇతడు ఇప్పటికే మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఈ సినిమా ప్లాప్ అయిన కూడా గౌతమ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇతడు భవిష్యత్తులో మంచి హీరో అవుతాడు అని ఫ్యాన్స్ పొగిడారు.ఇక ఇప్పుడు ఇతడు టీనేజ్ లో ఉన్నాడు.

మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఇతడు హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే గౌతమ్ కూడా మహేష్ బాబు లాగానే బయట కాస్త సిగ్గరిగా కనిపిస్తాడు.

కానీ ఇతడు తాజాగా చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ చుస్తే ఇతడేనా ఇలా చేసింది అని ఆశ్చర్య పోవడం ఖాయం.

గౌతమ్ మొట్టమొదటిసారిగా చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసి సూపర్ స్టార్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.

గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ వీడియోను నమ్రత షేర్ చేస్తూ 'ఇంతకంటే ఎక్కువ చూడడానికి వేచి ఉండలేను' అనే క్యాప్షన్ ఇచ్చింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. """/"/ మొత్తానికి గౌతమ్ తన నటనతో తన మాతృమూర్తి గర్వించదగిన సందర్భాన్ని తీసుకు వచ్చారు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.ఇతడు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.

ఆ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది.

ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ నెల 31న భారత్‎కు ప్రజ్వల్ రేవణ్ణ..!!