నా టాలెంట్ గురించి త్రివిక్రమ్ కి తెలుసు.. బాగా వాడేసారు.. మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గుంటూరు కారం (Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కాస్త ఆలస్యమైన అద్భుతమైనటువంటి కలెక్షన్లను రాబడుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం మహేష్ బాబు శ్రీ లీల (Sreeleela) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ అలాగే స్లాంగ్ అండ్ క్యారక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

"""/" / గుంటూరు కారం సినిమా కోసం నేను స్లాంగ్ అండ్ క్యారక్టరైజేషన్ కొత్తగా ట్రై చేసినది కాదు.

ఎవరికి తెలియని విషయం ఏమిటంటే మా అమ్మ ,అమ్మమ్మ ఇంట్లో ఎక్కువగా గుంటూరు స్లాంగ్( Guntur Slang ) మాట్లాడేవారు నేను వారితో మాట్లాడేటప్పుడు గుంటూరు స్లాంగ్ లోనే మాట్లాడేవాడిని కనుక నాకు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా ఇబ్బంది లేదని మహేష్ బాబు తెలిపారు.

అదేవిధంగా నాలో మరో టాలెంట్ కూడా ఉంది అంటూ ఈయన ఎవరికీ తెలియని తనలో ఉన్నటువంటి టాలెంట్ గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.

"""/" / నేను ఎవరితోనైనా రెండు గంటల పాటు మాట్లాడాను అంటే అచ్చుగుద్దినట్టు వారిలాగే మాట్లాడగలిగే టాలెంట్ ఉందని మహేష్ బాబు తెలిపారు.

నాలో ఉన్న ఈ టాలెంట్ గురించి త్రివిక్రమ్(Trivikram Srinivas) గారికి బాగా తెలుసు అందుకే ఆయన నాలో ఉన్న ఈ టాలెంట్ ఉపయోగించుకున్నారు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సింపుల్ ఇంటి చిట్కాతో ఈజీగా ఫేషియల్ గ్లో పొందొచ్చు.. తెలుసా?