నేను నా జీవితం లో అలాంటి పని చేయలేను : మహేష్ బాబు
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్ణయాల విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు.
ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడంటే ఆరు నూరైనా అదే మాటమీద నిలబడి ఉంటాడు.
ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు.ఆయన సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇదే రూల్ పాటిస్తున్నాడు.
అందుకే ఆయన క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.ప్రస్తుతం ఈయన మార్కెట్ 100 కోట్ల రేంజికి దాటింది.
ఫర్వాలేదు అనిపించుకున్న మహర్షి సినిమా కూడా 100 కోట్ల రూపాయల మైలు రాయిని అందుకుంది.
దీంతో దర్శక నిర్మాతలు సూపర్ స్టార్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే మహేష్ బాబు మాత్రం స్లో అండ్ స్టడీ అనే సూత్రాన్ని పాటిస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చేస్తున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సర్కారు వారి పాట డిసెంబర్ వరకు పూర్తి కానుంది.ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది.
అయితే ఈయన ఒక్కసారి కూడా రీమేక్ సినిమాల్లో నటించలేదు.ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటికే ఆయన పలుమార్లు క్లారిటీ ఇచ్చాడు.
తన 22 ఏండ్లలో ఏనాడు రీమేక్ చేయలేదన్నాడు.టాలీవుడ్ లో పలువురు హీరోలు రీమేక్ సినిమాల్లో నటించినా.
తను మాత్రం నో అంటున్నాడు.హిట్ అయినా ఫ్లాప్ అయినా తనకు స్ట్రెయిట్ మూవీసే కావాలని చెప్తున్నాడు.
"""/"/
రీమేక్ సినిమాలు ఎంత ఆకట్టుకుంటున్నా వాటి జోలికి మాత్రం పోలేదు.గతంలో చాలా సార్లు దర్శక నిర్మాతలు ఆయనతో రీమేక్ సినిమాలు చేసేందుకు ప్రయత్నించినా.
ఆయన ఓకే చెప్పలేదు.రెమ్యునరేష్ భారీగా ఇస్తామని చెప్పినా తను ఓకే చెప్పలేదు.
నిజానికి తనకు రీమేక్ సినిమాలు చేయడం అస్సలు ఇష్టం ఉండదని చెప్పాడు.అందులో తనను తాను చూసుకోలేనని వెల్లడించాడు.
రీమేక్ సినిమా చేస్తే.అందులో తాను నటించినా.
ఒరిజినల్ హీరోనే కనిపిస్తాడని చెప్పాడు.అందుకే ఆ సెకెండ్ ఇంపాక్ట్ తనకు వద్దంటున్నాడు.
దటీజ్ బాలయ్య… అభిమాని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య?