Mahesh Babu : జిమ్ లో తెగ కష్టపడుతున్న మహేష్.. పోకిరి మూవీని గుర్తు చేసావంటూ కామెంట్స్?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు.
ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. """/" /
ఇకపోతే మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లకు ఫిట్నెస్ గా ఉండడం అన్నది చాలా ముఖ్యం.
ముఖ్యంగా హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్ లో తెగ కష్టపడి వర్క్ అవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటారు.
హీరో ఎంత ఫిట్‌గా ఉంటే తెరపై అంత డైనమిక్‌గా, అందరికంటే స్పెషల్‌గా కనిపిస్తాడు.
అందుకే, హీరోలంతా ఫిట్‌గా ఉండటానికి జిమ్‌లో రోజూ కష్టపడుతూ ఉంటారు.అలా మహేష్ బాబు కూడా జిమ్ లో కష్టపడుతున్న వీడియోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
కాగా ఈ వయసులో కూడా మహేష్ బాబు ఎంతో ఎనర్జిటిక్ గా జిమ్ లో వర్కౌట్స్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
"""/" /
తాజాగా మహేష్ బాబు జిమ్‌లో చేసిన మూడు సెట్ల వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
వీటిలో తన ఫేవరేట్ స్కిల్‌మిల్ ఫినిషర్( Skillmill Finisher ) కూడా ఉందని చెప్పారు.
ఒక నిమిషం పాటు ల్యాండ్‌మైన్ ప్రెస్, మరో నిమిషం పాటు కెటల్‌బెల్ స్వింగ్స్, ఇంకో నిమిషం పాటు స్కిల్‌మిల్ రన్ ఇలా మూడు సెట్‌లు చేసినట్టు మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
మీరు ఎన్ని సెట్లు చేయగలరు? అంటూ అభిమానులను ప్రశ్నించారు.అయితే, ఈ మూడు సెట్లలో స్కిల్‌మిల్ సెట్ మహేష్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అంతే కాకుండా ఆ స్కిల్ మిల్ సెట్ ని చూస్తుంటే పోకిరి సినిమా ఇంట్రడక్షన్ సీన్ గుర్తుకు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పోకిరి సినిమాలోని రన్నింగ్ స్టైల్ ను మరోసారి గుర్తు చేశారు మహేష్ బాబు.
స్కిల్‌మిల్ మీద ఆయన పరిగెత్తిన తీరు అచ్చం పోకిరి సినిమాలో పరిగెత్తినట్టే ఉంది.
మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే మాట అంటున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లు పెడుతున్నారు.
హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మార్చే బెస్ట్ టానిక్ మీ కోసం!