సర్కారు వారి పాటలను ముగించేసిన థమన్
TeluguStop.com
సూపర్ స్టార్ హహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ప్రస్తుతం స్పెయిన్ లో శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా కోసం ఒక రొమాంటిక్ సాంగ్ ను స్పెయిన్ అందాల లొకేషన్ ల్లో చిత్రీకరిస్తున్నారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.తాజాగా థమన్ ట్విట్టర్ లో సర్కారు వారి పాట సినిమా కోసం అన్ని పాటల రికార్డింగ్ పూర్తి అయ్యిందని ప్రకటించాడు.
సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశకు వచ్చింది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా నుండి రాబోతున్న పాటలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండాలని భావిస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా పాటలు గత ఏడాది విడుదల అయిన అల వైకుంఠపురంలో సినిమా పాటల తరహాలో ఉంటాయని.
ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.థమన్ గత ఏడాది బన్నీకి ఇచ్చినంత మాస్ మసాలా సాంగ్స్ ను ఈ సినిమాలో కూడా ఇవ్వబోతున్నారు అంటున్నారు.
మొత్తానికి ఈ సినిమా ఆడియో పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లో తాజాగా థమన్ పాటలన్నీ రికార్డింగ్ పూర్తి అయ్యాయి అంటూ ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు సర్కారు వారి పాట సినిమా పాటలు వింటామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"""/"/
ఈ సినిమా పాటలు బాక్సాఫీస్ వద్ద సినిమాను కలెక్షన్స్ సునామిలో నింపే అవకాశాలు ఉన్నాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ముందు ముందు థమన్ కు మరిన్ని టాప్ సినిమాలు పడాలి అంటే ఖచ్చితంగా సర్కారు వారి పాట సినిమా పాటలు సూపర్ హిట్ అవ్వాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అద్భుతం: తప్పిపోయిన కుక్క తిరిగి రావడమే కాదు.. డోర్‌బెల్ మోగించి షాకిచ్చింది!