బుధవారం రోజున సర్కారు వారి పాట బుకింగ్స్ అలా ఉన్నాయా.. అన్ని కోట్ల నష్టం అంటూ?

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సర్కారు వారి పాట మిక్స్ డ్ టాక్ తో మొదలై ఫస్ట్ వీకెండ్ వరకు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

అయితే సోమవారం నుంచి సర్కారు వారి పాట సినిమా వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించడం గమనార్హం.

ఆదివారంతో పోల్చి చూస్తే సోమవారానికి 70 శాతం డ్రాప్స్ కనిపించగా ప్రస్తుతం 80 శాతం డ్రాప్స్ ఉన్నాయని తెలుస్తోంది.

20 శాతం ఆక్యుపెన్సీతో ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.సోమవారం రోజున కర్నూలులో సక్సెస్ మీట్ పెట్టినా సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లు మాత్రం పుంజుకోకపోవడం గమనార్హం.

ఈ సినిమాకు హైదరాబాద్ లో కూడా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.ఏఎంబీ సినిమాస్ మినహా మరే థియేటర్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ కనిపించడం లేదంటే సర్కారు వారి పాట పరిస్థితి ఏంటో సులభంగానే అర్థమవుతోంది.

సమ్మర్ సెలవుల అడ్వాంటేజ్ ను కూడా ఈ సినిమా అస్సలు క్యాష్ చేసుకోలేదు.

ఈ సినిమా ద్వారా నిర్మాతలకు 30 కోట్ల రూపాయల వరకు నష్టం తప్పదని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా నిర్మాతలు వరుసగా సినిమాలను నిర్మిస్తున్న నేపథ్యంలో తర్వాత సినిమాలతో ఈ సినిమా నష్టాలను భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

నైజాంతో పోలిస్తే ఏపీలో సర్కారు వారి పాట కలెక్షన్లు కొంతమేర మెరుగ్గానే ఉన్నాయని సమాచారం అందుతోంది.

"""/"/ ఈరోజు నుంచి సర్కారు వారి పాట టికెట్ రేట్లు తగ్గనున్నాయని సమాచారం.

అయితే టికెట్ రేట్లు తగ్గినా ఈ సినిమా ఏ మాత్రం పుంజుకుంటుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.

శనివారం, ఆదివారం కలెక్షన్లతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్టేనని చెప్పవచ్చు.ఎఫ్3 సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం సర్కారు వారి పాట సినిమాకు నష్టమేనని చెప్పవచ్చు.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి