సర్కారు వారి పాట రేపటి నుండి క్లారిటీ వచ్చేయనుంది

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి మూడు రోజులు అవుతుంది.

నేడు ఆదివారం నాల్గవ రోజు కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.సాదారనంగా అయితే సినిమా లు శుక్రవారం విడుదల అవుతాయి.

కాని సర్కారు వారి పాట సినిమా విషయంలో అభిమానులు ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ వీకెండ్‌ దక్కుతుందని గురువారం విడుదల చేయడం జరిగింది.

గురు వారం నుండి ఆది వారం వరకు వసూళ్లు పాజిటివ్ గా నమోదు అయ్యాయి.

సినిమా కు ఎలాంటి టాక్ వచ్చినా కూడా సర్కారు వారి పాట సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

పెద్ద ఎత్తున సర్కారు వారి పాట సినిమా నుండి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సోమ వారం నుండి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి అనేది చూడాలి.

సోమ వారం వచ్చే వసూళ్లను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు కంటిన్యూ అయితే ఖచ్చితంగా మొదటి పది రోజుల్లో లేదా అంతకంటే తక్కువ రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

"""/"/ కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టాక్‌ నేపథ్యంలో సోమ వారం నుండి టాక్ కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

సోమ వారం నుండి వసూళ్లు తగ్గితే మాత్రం బయర్లు చాలా నష్టపోవాల్సి రావచ్చు అంటున్నారు.

ఇటీవలే ఆచార్య సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లు ఇప్పుడు సర్కారు వారి పాట వల్ల కూడా నష్టపోతే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.

సోమ వారం కు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కనుక అంతా రేపటి గురించి వెయిట్ చేస్తున్నారు.

రోజా పొలిటికల్ సైలెన్స్ అందుకేనా ?