మహేష్‌కు నచ్చిందట.. సగం పని పూర్తి చేసిన మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వచ్చే సమ్మర్‌లో ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు వంశీ పైడిపల్లి ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఈ సమయంలోనే మహేష్‌ తదుపరి చిత్రంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మహేష్‌ 26వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రంను నిర్మించబోతున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.సినిమా కోసం సుకుమార్‌ మొదట ఒక కథను సిద్దం చేశాడట.

కాని ఆ కథ మహేష్‌బాబుకు నచ్చక పోవడంతో మళ్లీ కొత్త కథను సిద్దం చేయాల్సి వచ్చింది.

దాంతో సినిమా ప్రారంభంకు ఆలస్యం అవుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పలు స్టోరీ లైన్స్‌ వినిపించిన తర్వాత ఎట్టకేలకు ఒక స్టోరీకి మహేష్‌బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మహేష్‌ స్టోరీకి ఓకే చెప్పడంతో వెంటనే సుకుమార్‌ స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీ అయ్యాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు మూవీ కోసం ఒక విభిన్నమైన స్టోరీ లైన్‌ను దర్శకుడు సుకుమార్‌ సిద్దం చేశాడట.

మంచి స్కిప్ట్‌ రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.స్టోరీ ఫైనల్‌ అవ్వడంతో సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.