గుంటూరు కారం నా చివరి సినిమా కావచ్చు.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మహేష్ బాబు!
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
జనవరి 12 వ తేదీ విడుదల అయిన ఈ సినిమా మొదట్లో కాస్త నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా వసూళ్లు రాబడుతోంది.
ఇకపోతే ఇటీవల చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.
స్వయంగా మహేష్ బాబు ఈ సినిమా సక్సెస్ పార్టీని అరెంజ్ చేశారు. ఈ పార్టీ అనంతరం మహేష్ బాబు యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
"""/" /
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా తాను తెలుగులో ఇక పై సినిమాలు చేయకపోవచ్చు అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు స్లాంగ్, మాస్ డాన్సులు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో రెండు మాస్ పాటలు( Mass Songs ) ఉండాలని నేను త్రివిక్రమ్(Trivikram Srinivas) గారు ముందుగానే అనుకున్నామని తెలిపారు.
"""/" /
ఈ సినిమా తరువాత నేను మళ్ళీ రీజినల్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు.కాబట్టి మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో ఉండదు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల వైరల్ అవుతున్నాయి ఇదే ఆఖరి సినిమా కావచ్చు అంటే ఈయన ఇకపై తెలుగు సినిమాలు( Telugu Movies ) చేయరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో గోడౌన్ లో నెక్లెస్ గొలుసు పాట పెట్టినప్పుడు కాన్ఫిడెంట్ గా డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాను కానీ శ్రీలీల డాన్స్ చూసి భయమేసిందంటూ ఈయన చేసిన వ్యాక్యాలు వైరల్ అవుతున్నాయి.
ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!