అది అసలు బీడీనే కాదు… స్మోకింగ్ నేను ఎంకరేజ్ చేయను: మహేష్ బాబు
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా మాస్ లుక్ లో కనిపించారు.
బీడీ(Beedi) తాగుతూ ఈయన ఈ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో బీడీ తాగడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు సాధారణంగా స్మోకింగ్ చేయరు.అదేవిధంగా స్మోకింగ్ ఎంకరేజ్ కూడా చేయరు.
కానీ ఈ సినిమాలో ఈయన బీడీ తాగారు అంటూ ఎన్నో సందర్భాలలో విమర్శలు వచ్చాయి.
"""/" /
ఇక ఈ విషయం గురించి తాజాగా ఈయన మాట్లాడుతూ అసలు విషయం వెల్లడించారు.
ఈ సినిమాలో నేను తాగినది రియల్ బీడీ కాదని, ఆయుర్వేదిక్ బీడీ( Ayurvedic Beedi ) అని అసలు విషయం చెప్పారు.
మొదటి రోజు తాను రియల్ బీడీ తాగాను.ఆరోజు మొత్తం తనకు మైగ్రేన్ హెడేక్ వచ్చేసిందని నావల్ల కాదు అంటూ త్రివిక్రమ్( Trivikram ) గారికి చెప్పేసాను.
దాంతో ఆయన ఆయుర్వేదిక్ బీడీ తెప్పించారు.ఇందులో ఏ విధమైనటువంటి పొగాకు కానీ హానికర పదార్థాలు కాని లేవని తెలిపారు.
"""/" /
ఈ ఆయుర్వేదిక్ పూర్తిగా లవంగాలు పుదీనా ఫ్లేవర్ తో ఉందని దీనిని తాగినప్పుడు తనకు ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ కలగలేదని మహేష్ బాబు తెలిపారు.
ఇక తాను స్మోకింగ్ చేయను అలాగే స్మోకింగ్( Smoking ) ఎంకరేజ్ చేయను అంటూ మరోసారి మహేష్ బాబు తెలిపారు.
ఒక్క బీడీతో సినిమా మొత్తం కానిచ్చేసాము అంటూ మహేష్ బాబు బీడీ సీక్రెట్ బయటపెట్టారు.
ఇక ఈ విషయం గురించి శ్రీ లీల మాట్లాడుతూ.ఆయుర్వేదిక్ బీడిను చాలా భద్రంగా తీసుకువస్తారు.
షాట్ పూర్తి కాగానే తీసుకువెళ్లి దానిని బీడీ కవర్లో చుట్టి పెట్టే వాళ్ళు అంటూ శ్రీ లీల కూడా చెప్పినటువంటి ఈ సమాధానం వైరల్ అయింది.
యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణశిక్ష .. భారత్‌కు ఇరాన్ ఆపన్న హస్తం, కాపాడతామని హామీ