Mahesh Babu : 551 కోట్ల రూపాయలతో మహేశ్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారు మహేష్ బాబు.

ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం గుంటూరు కారం.

ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 12న విడుదల కానుంది.ఇప్పటికే ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్‌ ను చేసుకుంది.

"""/" / ఈ నేపథ్యంలో మహేశ్ తాజాగా ఒక సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఈ గుంటూరు కారం( Guntur Karam ) మూవీపై అంచనాలు భారీ స్థాయాలో నెల కొన్నాయి.

దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.

ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.102 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, మిగిలిన వెర్షన్లను కలుపుకుని రూ.132 కోట్లు వ్యాపారం అయింది.

అయితే మహేష్ కెరియర్ లో గతంలో విడుదలైన స్పైడర్ సినిమా భారీగా బిజినెస్ ను సొంతం చేసుకుంది.

"""/" / ఈ సినిమా తరువాత వచ్చిన భరత్ అనే నేను సినిమా( Bharat Ane Nenu ) ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

ఆ తర్వాత విడుదల అయినా మహర్షి సినిమాతో మహేష్ బాబు స్థాయి మరింత పెరిగింది.

మహర్షి సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ.

100 కోట్లు బిజినెస్ జరిగింది.ఈ రెండు సినిమాల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో అందుకున్న మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా రూ.

99.30 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను మాత్రమే చేసుకుని అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.

ఇక సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని సత్తా చాటుకుంది.

ఈ విధంగా మహేష్ బాబు సినిమాలు అన్నీ కూడా దాదాపుగా 551 కోట్ల రూపాయల బిజినెస్ తో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఊ అంటావా మామ కిస్సిక్ సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఇదే.. అసలేం జరిగిందంటే?