మహేష్‌ను జక్కన్న ఎందులో దించుతున్నాడు?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న చేస్తున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతుటన్నట్లు ప్రకటించాడు.

దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేస్తున్నాడంటే ఆ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే హిస్టారికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్త రికార్డును క్రియేట్ చేసిన జక్కన్న మహేష్‌తో ఎలాంటి జోనర్ సినిమాను తెరకెక్కిస్తాడనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

ఎక్కువగా హిస్టారికల్ చిత్రాలనే ఇష్టపడే జక్కన్న, ఇప్పుడు మహేష్ కోసం తన పంథాను మార్చుకుంటాడా లేక కంటిన్యూ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా హిస్టారికల్ సినిమాలకు మహేష్ సెట్ కాకపోవచ్చనే వాదన ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే.

అయితే తాను ఎలాంటి సినిమాలనైనా చేయడానికి రెడీ అంటూ గతంలో మహేష్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ కాంబోలో రాబోయే సినిమా కోసం అందరినీ ఆతృతగా ఎదురుచూసేలా చేస్తోంది.

గ్రీన్ టీలో ఇవి కలిపి రాశారంటే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది..!