#EMK సర్‌ప్రైజ్‌ : ఎన్టీఆర్, మహేష్‌ బాబు ఎపిసోడ్ లో పవన్ కూడా..!

తెలుగు బుల్లి తెరపై అద్బుతం ఆవిష్కారం కాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.అదే ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఎన్టీఆర్ మరియు మహేష్ బాబులు కనిపించబోతున్నారు.

మహేష్‌ బాబు సహజంగా ఇలాంటి గేమ్ షో లను పెద్దగా చేసేందుకు ఆడేందుకు చూసేందుకు ఆసక్తి చూపించడు అనేది టాక్.

టాక్ షో లు మరియు గేమ్ షో లకు దూరంగా ఉండే మహేష్ బాబును తన ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా మహేష్ బాబును తీసుకు వచ్చాడు.

మూడు నాలుగు నెలల క్రితం ఈ షో కు సంబంధించిన షూటింగ్ ను చేయడం జరిగింది.

అప్పటి నుండి ఇదుగో అదుగో అంటూ మహేష్ బాబు ఎపిసోడ్‌ ను వాయిదా వేస్తూ వచ్చారు.

దసరాకు ఖచ్చితంగా వస్తుందనుకుంటే సమంత వచ్చింది.సరే దీపావళికి మహేష్ వస్తాడనుకుంటే అప్పుడు కూడా నిరాశ పర్చారు.

జెమిని టీవీ వారిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఎట్టకేలకు సీజన్ ముగింపు నేపథ్యంలో మహేష్ బాబు ఎపిసోడ్ ను టెలికాస్ట్‌ చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

మహేష్ బాబు ఎన్టీఆర్‌ లు మాత్రమే కాకుండా ఈ ఎపిసోడ్‌ లో పవన్‌ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్‌ తో ఎన్టీఆర్‌ మరియు మహేష్ బాబులు వీడియో కాల్‌ లో మాట్లాడారట.

"""/"/ మహేష్‌ బాబు ఒక ప్రశ్నకు సాయం కోసం పవన్‌ కళ్యాణ్ కు వీడియో కాల్‌ చేయడం.

ఆ సమయంలో పవన్ వీడియో కాల్‌ లో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు అంటూ సమాచారం అందుతోంది.

వీరు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు.ముగ్గురు కూడా ముచ్చట్ల విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 పవన్ కళ్యాణ్‌ మరియు మహేష్ బాబులు చర్చించి సమాధానం చెప్పిన ఆ ప్రశ్న ఏమై ఉంటుందా అనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

Viral : ఇదేందయ్యా ఇది.. మాజీ ప్రియురాలి టాయిలెట్ చోరీ చేసిన ప్రియుడు..