మహేష్‌బాబు అంతటి సాహసం మళ్లీ చేయక పోవచ్చు

మహేష్‌బాబు అంతటి సాహసం మళ్లీ చేయక పోవచ్చు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 27వ చిత్రంపై సస్పెన్స్‌ కొనసాగుతుంది.గత కొంత కాలంగా మహేష్‌బాబు 27వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి.

మహేష్‌బాబు అంతటి సాహసం మళ్లీ చేయక పోవచ్చు

కాని ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు మరో దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నాడట.

మహేష్‌బాబు అంతటి సాహసం మళ్లీ చేయక పోవచ్చు

వంశీ ఇంకా స్క్రిప్ట్‌ రెడీ చేయని కారణంగా మరో దర్శకుడితో 27వ చిత్రం చేసి ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాను వంశీతో చేస్తే బాగుంటుందనే అభిప్రాయానిక వచ్చాడట.

మహేష్‌ బాబు కొత్త సినిమా దర్శకుడు ఎవరు అనే విషయమై రోజుకు ఒక వార్త వస్తుంది.

పరశురామ్‌ నుండి సందీప్‌ రెడ్డి వంగ వరకు పలువురి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో కూడా మహేష్‌బాబు చేస్తాడేమో అంటూ ప్రచారం జరుగుతోంది.

రజినీకాంత్‌తో దర్బార్‌ చిత్రం ప్రస్తుతం ఖాళీగానే ఉన్న దర్శకుడు మురుగదాస్‌ ఇటీవలే ఒక కథను మహేష్‌బాబుకు వినిపించాడని అంటున్నారు.

"""/"/కథ విషయంలో సంతృప్తి చెందిన మహేష్‌బాబు ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది.

అయితే మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్‌బాబుతో స్పైడర్‌ చిత్రాన్ని చేసిన మురుగదాస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ ఇచ్చాడు.అందుకే ఖచ్చితంగా మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు సినిమా ఉండక పోవచ్చు అంటున్నారు.

మురుగదాస్‌ దర్శకత్వంలో చేసేంతటి సాహస నిర్ణయాన్ని మహేష్‌బాబు తీసుకోడు అంటున్నారు.మరి అసలు విషయం ఏంటీ అనేది త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.