పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేస్తే మహేష్ ఓకే చెప్పాడు.. సినిమా ఫ్లాప్.. ఆ సినిమా ఏదంటే?

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇప్పటికే అందుకోసం తన ఫిట్ నెస్ ని మెయింటైన్ చేయడంతో పాటు జుట్టును కూడా బాగా పెంచేశాడు.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో కొన్ని నెలలుగా జక్కన్న సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

అంతేకాదు తన లుక్ పూర్తిగా మార్చేసి అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తున్నారు మహేష్ బాబు.

"""/" / ఇప్పటికే మహేష్ న్యూలుక్ ఫోటోస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

అలాగే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరో మహేష్ కెరీర్ లో ఎన్నో హిట్స్, అలాగే మరెన్నో ప్లాప్ మూవీస్ ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.

మహేష్ బాబు నటించిన సినిమాలలో నిజం సినిమా( Nijam Movie ) కూడా ఒకటి.

తేజ రచించి దర్శకత్వం వహించారు.ఇందులో మహేష్ సరసన ఇడియట్ మూవీ ఫేమ్ రక్షిత హీరోయిన్ గా నటించింది.

"""/" / అలాగే ఈ మూవీలో గోపిచంద్ విలన్ పాత్రలో నటించారు.రాశి, రంగనాథ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

2003 మే 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

అయితే ఈసినిమాకు అంతగా రెస్పాన్స్ రాకపోయినా అనేక పురస్కారాలు అందుకుంది.ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటిగా తాళ్లూరి రామేశ్వరి నంది అవార్డ్స్ అందుకున్నారు.

తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదట.అవును ఈ చిత్రాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) తెరకెక్కించాలని అనుకున్నాడట.

ఆ తర్వాత ఈ మూవీ స్టోరీని పవన్ కు చెప్పగా, సున్నితంగా తిరస్కరించారట.

దీంతో ఈ సినిమా మహేష్ వద్దకు వెళ్లింది.2003లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం