Mahesh Babu : సరికొత్త లుక్ తో అదరగొడుతున్న మహేష్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఐదు పదుల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అమ్మాయిల మనసులను కొల్లగొడుతున్నాడు మహేష్.

కాగా మహేష్ బాబు తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనందరికీ తెలిసిందే.

ఇతర హీరోల మాదిరిగా మహేష్ బాబు జిమ్లో వర్కౌట్స్ చేయడం యోగాలు చేయడం లాంటివి చేయకపోయినా కూడా ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉంటాడు.

"""/" / అంతేకాకుండా తన సినిమాల కోసం కొత్త లుక్స్( New Looks ) ని కూడా పెద్దగా ట్రై చేయడు.

అప్పుడెప్పుడో విడుదలైన పోకిరి సినిమా తర్వాత అంత మాస్ యాంగిల్, మాస్ లుక్ మరే సినిమాలో కనిపించలేదు.

వన్ నేనొక్కడినే సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసినప్పటికీ ఆ విషయంలో కాస్త ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు.

ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలు కొత్త లుక్ లో కనిపించకపోయినప్పటికీ మహేష్ బాబులు లోని కొత్త యాంగిల్ ను త్రివిక్రమ్ పరిచయం చేయబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివిల్ చేసినప్పుడే అభిమానులకు బాగా అర్థం అయింది.

"""/" / ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా మహేష్ బాబు షూటింగ్ కూడా పూర్తిగా దూరంగా ఉంటూ వెకేషన్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే మాములుగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు మహేష్ బాబు.

కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లి చాలా రోజులు అవుతున్నా ఫ్యామిలీ పిక్ గాని సింగిల్ పిక్ గాని బయటకు రాలేదు.

ఇది ఇలా ఉంది తాజాగా మహేష్ బాబు ఒక సెల్ఫీ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అందులో మహేష్ బాబు ఒక సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.సెల్ఫీ దిగుతూ ఎంచక్కా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చాడు.

అంతేకాకుండా హెయిర్ స్టైల్ ని కూడా పూర్తిగా మార్చేశాడు.అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఏంటి బాస్.. ఎప్పుడు దోశలు తినలేదా.. మరి ఇంత కక్కుర్తి ఏంటి? (వీడియో)