పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ లో మహేష్.. సూపర్ స్టార్ కొత్త లుక్ మామూలుగా లేదుగా!
TeluguStop.com
టాలీవుడ్ హీరో మహేష్ బాబు, రాజమౌళి( Mahesh Babu, Rajamouli ) కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది.అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.మహేశ్‌బాబు, రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.లుక్ టెస్ట్‌లో భాగంగానే ఈ చిత్ర బృందం దుబాయ్‌కు ( Dubai )వెళ్లినట్లు సమాచారం.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అమెజాన్ అడవుల( Amazon Forests ) నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా నటించనున్నారు.
భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు.దుర్గా ఆర్ట్స్‌పై కె.
ఎల్.నారాయణ ( KL Narayana )ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీనికి మహారాజ్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్. """/" /
వెండితెరపై సరికొత్త లుక్ లో మహేశ్ కనిపించనున్నారు.
ఆ పాత్ర కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు.మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్ రెడీ చేసినట్లు టాక్.
ఇకపోతే ఈ సినిమాకోసం, ఈ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చూడాలి మరి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025