మహేష్-నాని మల్టీస్టారర్.. సాలిడ్ అప్డేట్ వచ్చేసింది..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయిన్ నే వేరు.

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.

ఇక ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా మొదట్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఆ తర్వాత మాత్రం సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.

ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఒక వైపు దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా గురించి చర్చిస్తూనే మరో వైపు ఇప్పటికే లాంచ్ చేసిన త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ జులై నుండి స్టార్ట్ కాబోతుందట.ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఒక వార్త నెట్టింట నిన్నటి నుండి వైరల్ అవుతూనే ఉంది.

ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ తో పాటు న్యాచురల్ స్టార్ నాని స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నాడు అని వైరల్ అవుతుంది.

అయితే ఇది నిజమే అని తెలుస్తుంది. """/"/ మహేష్, నాని మల్టీస్టారర్ కోసం త్రివిక్రమ్ ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాడట.

ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం ఇప్పటికే ముగ్గురు హీరోలను సంప్రదించారట.

కానీ ఫైనల్ గా నాని ని లాక్ చేసినట్టు సమాచారం.ఈ పాత్ర సెకండాఫ్ లో ఎక్కువుగా కనిపిస్తుందట.

నాని ఈ సినిమాలో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పక పోవడంతో త్రివిక్రమ్ ఈ పాత్రను మరింత మెరుగులు దిద్దుతున్నాడట.

నాని సెకండ్ హీరోగా నటించడం ఇదేమీ కొత్త కాదు.నాగార్జున తో కలిసి దేవదాస్ సినిమాలో నటించి మెప్పించాడు.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నారు…