మహేష్ బాబు నంబర్ వన్.. నాని నంబర్2.. ఈ హీరోలకు సొంతమైన రికార్డ్ ఇదే!
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) సినిమా విడుదలైతే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
ఓవర్సీస్ లో మహేష్ బాబు నటించిన 12 సినిమాలు 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
మహేష్ సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం కూడా అరుదైన రికార్డులు సొంతం కావడానికి కారణమని చెప్పవచ్చు.
ఈ జాబితాలో మహేష్ బాబు తర్వాత స్థానంలో నాచురల్ స్టార్ నాని ఉన్నారు.
నాచురల్ స్టార్ నాని( Nani ) నటించిన సినిమాలలో ఏకంగా 10 సినిమాలు 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
నాని ఖాతాలో చేరుతున్న ఈ రికార్డులు ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
"""/" /
మహేష్ బాబు తొలి స్థానంలో నిలిస్తే నాని తర్వాత స్థానంలో నిలిచారు.
సరిపోదా శనివారం మూవీ శుక్రవారం రోజు కూడా బాగానే కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఈ మూవీకి ఈరోజు, రేపు బుకింగ్స్ బాగానే ఉండటం బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.
మహేష్, నాని కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. """/" /
నాని కొత్త సినిమా శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
నాని రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
నానికి ఇతర భాషల్లో సైతం క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.
నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.నాని కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఉండటం కొసమెరుపు.
ఆ విషయంలో మహేష్ నమ్రతలతో పోల్చి చూస్తే సితార టాప్.. అసలేం జరిగిందంటే?