ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం… వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఎన్నో స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్లను కూడా రాబట్టాయి.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కృష్ణ వంశీ( Krishna Vamshi ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం మురారి( Murari ) .
మహేష్ బాబు సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
"""/" /
ఇక ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనాలను సృష్టించింది.అయితే ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మహేష్ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా వెలువడింది.ఈ రీరిలీజ్‌ను కొంచెం వినూత్నంగా ప్లాన్ చేశారు.
ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన పత్రిక ( Wedding Invitation )అంటూ పెళ్లి కార్డుల రూపంలో డిజైన్ చేసి ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
"""/" /
ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం అంటూ వరుడు మురారి వధువు వసుంధర అంటూ ఈ వివాహ పత్రికను తయారు చేశారు.
ఈ వివాహానికి అందరూ ఆహ్వానితులే వివాహపు తేదీ ఆగస్టు 9వ తేదీ, వేదిక మీ అభిమాన థియేటర్లలో అంటూ వినూత్నంగా ఈ పెళ్లి పత్రికను తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఈయన రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది.
రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా..?