మహేష్ సినిమాలంటే అంతేనా.. వసూళ్లు ఎక్కువగా చూపిస్తారా?

ఇటీవలి కాలంలో పెద్ద నిర్మాణ సంస్థలో నిర్మించే సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ విషయంలో ఎంతో అయోమయం నెలకొంటుంది అన్న విషయం తెలిసిందే.

భారీ నిర్మాణ సంస్థలు తమ సినిమాల కలెక్షన్స్ కాస్త ఎక్కువ చేసి చూపిస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నడుస్తోంది.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల విషయంలో కూడా ఇదే విషయం తెరమీదికి వచ్చింది అన్నది తెలుస్తుంది.

ఇప్పుడు మాత్రమే కాదు గత కొన్ని సినిమాల నుంచి కూడా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే చాలు కలెక్షన్ల విషయంలో ఏదో ఒక గొడవ తెరమీదికి వస్తూనే ఉంది వాస్తవ వసూళ్లను కాకుండా చెప్పే వసూళ్లకు అస్సలు సంబంధం ఉండటం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు.

కొన్నేళ్ల కిందట మహేష్ బాబు హిట్ మూవీ భరత్ అనే నేను సినిమా వసూళ్ల విషయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది.

ఇక రిలీజ్ రోజే నిర్మాతలు కొన్ని పోస్టులు విడుదల చేయగా.అందులో వసూళ్లను ఎక్కువ చేసి చూపించారు అంటూ అందరికీ అర్థమైపోయింది.

ఎందుకంటే నిర్మాతలు చెప్పిన నెంబర్లు అంతఅసహజంగా కనిపించాయని చెప్పాలి.అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా తీస్తున్న ప్రతి నిర్మాణ సంస్థ కూడా ఇదే దారిలో వెళుతూ ఉండడం గమనార్హం.

మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా ఇదే జరిగింది అని తెలుస్తుంది.

ఇక ఎప్పుడూ సర్కారు వారి పాట వస్తువుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్న టాక్ వినిపిస్తోంది.

"""/"/ ప్రస్తుతం సినిమా విశ్లేషకులు, బాక్సాఫీస్ వెబ్సైట లూ ఇస్తున్న వాసుళ్లకు అటు చిత్ర నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేస్తున్న నెంబర్లకు అసలు పొంతన లేదు అని చెప్పాలి.

బాక్సాఫీస్ వెబ్సైట్ లే అసలు వసూళ్ల కంటే కాస్త ఎక్కువ చూపిస్తున్నాయి అంటే ఇక నిర్మాతలు మరింత ఎక్కువగా చూపిస్తూ ప్రేక్షకులను మోసం చేస్తున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది వాస్తవానికి అయితే ఈ సినిమా షేర్ 80 కోట్లకు అటు ఇటు గా ఉండే కలెక్షన్స్.

125 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.కానీ నిర్మాతలు రిలీజ్ చేసిన పోస్టులను రాత1 65 కోట్లకు పైగా గ్రాస్ 100 కోట్లకి పైగా షేర్ వసూలు చేస్తున్నట్లు చెప్పారు.

దీంతో ఇక ఈ విషయంపై కొంత మంది పెదవి విరుస్తూఉన్నారు అని చెప్పాలి.

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు.. ఘనంగా గృహప్రవేశ వేడుకలు!