మహేష్ బాబు చేసిన ఆ హిట్ మూవీ.. మాజీమంత్రి జీవిత కథ మీకు తెలుసా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో దర్శకులు కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనల ద్వారా స్ఫూర్తి పొంది సినిమా స్టోరీ లు రాసుకుంటూ ఉంటారు.
మరికొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఆధారంగా స్ఫూర్తి పొంది సినిమా స్టోరీ లు రాసుకొని ఇక ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
అచ్చంగా ఇలాగే ఒక గొప్ప రాజకీయ నాయకుడు జీవిత కథ ఆధారంగా మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వచ్చింది.
వరుస డిజాస్టర్ లతో కెరీర్లో ఎంతో కిందికి పడిపోయిన మహేష్ బాబును గోడకు కొట్టిన బంతి లాగా మళ్లీ వేగంగా పుంజుకునేలాగా చేసింది ఆ సినిమా.
ఆ సినిమా ఏదో కాదు 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దూకుడు.శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో ట్విస్ట్ లు ప్రేక్షకుల మతి పోగొడుతూ ఉంటాయి.ఇక ఈ సినిమా స్టోరీ ఎలా పుట్టింది అన్న విషయాన్ని ఎవరూ చెప్పడం కాదు ఏకంగా దర్శకుడు శ్రీను వైట్ల ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
శ్రీను వైట్ల మహేష్ బాబు సోదరి మంజుల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు.ఇక సినిమా ఏ హీరో చెయ్యాలా అని అనుకుంటున్నా సమయంలో ఇంకా ఎవరో ఎందుకు మహేష్ బాబు ఉన్నాడు అని సలహా ఇచ్చింది మంజుల.
"""/"/
దీనికి మహేష్ బాబు కూడా ఓకే చెప్పాడు.ఇక శ్రీను వైట్ల గోపీమోహన్ రాసుకున్న స్టోరీని ఇక సినిమాగా తీయాలని అనుకున్నాడు.
ఎందుకో కథ శ్రీనువైట్లకు నచ్చలేదు.ఇక ఈ విషయాన్ని ఓ రోజు మహేష్ బాబుకు చెప్పారట శ్రీనువైట్ల.
మహేష్ కూడా కథ నచ్చలేదని ఓపెన్ అయ్యారట.ఆ తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి జీవితంలోని కొన్ని అంశాలను తీసుకొని శ్రీనువైట్ల ఒక లైన్ రాసుకున్నాడట.
ఈ లైన్ గోపీమోహన్ తో చర్చించగా ఒక కథ సిద్ధం చేసా.రు ఈ కథ విన్న మహేష్ మైండ్ బ్లోయింగ్ అనేసారూ.
అదే సినిమాకు రావడం ఇక మహేష్ బాబు కథ విన్నప్పుడు చెప్పిన మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ డైలాగులు సినిమాలో కూడా పెట్టడం జరిగింది.
అక్కడ కూడా సత్తా చాటిన బాలయ్య.. ఇకపై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కానున్నాయా?