బిల్ గేట్స్ తో మహేష్ దంపతులు.. సెన్సేషనల్ పోస్ట్ షేర్.. పిక్ వైరల్!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు 46 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను ఫ్లాట్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు.
అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఇటీవలే మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.ఈ సినిమా ప్రెసెంట్ ఓటిటి లో కూడా అదే రేంజ్ లో సందడి చేస్తుంది.
ఇక మహేష్ బాబు సర్కారు సక్సెస్ తర్వాత అమెరికాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నాడు.తాజాగా షేర్ చేసిన ఫొటో అందరిని ఆకట్టు కోవడమే కాకుండా అందరిని స్టన్ అయ్యేలా చేస్తుంది.
ఈయన వెకేషన్ కు వెళ్లి చాలా రోజులు అవుతుంది.ఇప్పటికే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన చాలా మూమెంట్స్ ను షేర్ చేసుకుని ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసాడు.
"""/"/ ఇక ఇప్పుడు మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో చూసిన ఎవ్వరికి నోట మాట రావడం లేదు.
ఈయన షేర్ చేసుకున్న ఫోటో ఇప్పుడు అంతర్జాలంలో సెన్సేషనల్ అయ్యింది.మరీ అంతగా ఆ ఫొటోలో ఏముందా అని ఆలోచిస్తున్నారా.
"""/"/
మహేష్ బాబు తన భార్య నమ్రత తో కలిసి బిల్ గేట్స్ తో దిగిన ఫోటోను షేర్ చేసాడు.
ఈయన ఈ ఫోటో షేర్ చేస్తూ బిల్ గేట్స్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది అని తాను ప్రపంచంలో గ్రేటెస్ట్ విజన్ కలిగిన వ్యక్తుల్లో ఒకరు అని.
ఆయన తన ఇన్స్పిరేషన్ అని మహేష్ చెబుతూ ఆ ఫోటోను షేర్ చేసాడు.
ఈ ఫోటో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.