ఆమె లేకపోతే నేను లేను అంటున్న మహేష్
TeluguStop.com
తన భార్య నమ్రత శిరోద్కర్ లేకపోతె నేను లేను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటున్నాడు.
ఇటీవల పిల్లలతో ఫారెన్ టూర్ వెళ్లిన మహేష్ ఇండియా కు తిరిగి వచ్చారు.
ఈ సందర్భంగా మహేష్ మీడియా తో మాట్లాడుతూ తన భార్య నమ్రత పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ లో ఈ జోడి ని చూడగానే ఎవరైనా ఆదర్శ దంపతులు అంటే ఇలానే ఉండాలి అన్నంత అనోన్యంగా వీరు ఉంటారు.
పెళ్లై 14 ఏళ్లైపోయినా ఇప్పటి వరకు చిన్న గొడవ కూడా రాకుండా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా హాయిగా ఉన్నారు ఈ జంట.
ఇక ఇప్పుడు తన భార్య నమ్రత గురించి మనసులో మాట బయటికి మహేష్ చెప్పాడు.
ఆమె లేకుండా నేను లేనని అసలు నమ్రత లేకుండా తనకే పని చేతకాదంటూ మహేష్ అంటున్నాడు.
ఎలాంటి టెన్షన్స్ లేకుండా సినిమాలు చేస్తున్నాను అంటే దానికి పూర్తిగా నా భార్యే కారణం అని తన టెన్షన్స్ అన్నీ ఆమె తీసుకుంటుంది అని మహేష్ చెప్పుకొచ్చాడు.
ఒక్క వ్యక్తిగత జీవితంలోనే కాదు సినిమాల విషయంలో కానీ.యాడ్స్ విషయంలో కానీ అన్నింట్లోనూ నమ్రత పాత్ర కీలకమే అంటున్నాడు మహేష్ బాబు.
"""/"/ తన చెంతకు ఎలాంటి టెన్షన్స్ రాకుండా ప్రశాంతంగా ఉండటానికి నమ్రత కేర్ తీసుకుంటుంది అని అన్నాడు.
పిల్లలను బాగా గారాబం చేసే విషయంలో కూడా నమ్రత మాత్రం తన విషయంతో పాటు పిల్లల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెప్పాడు సూపర్ స్టార్.
జులై 5 నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీ కానున్నాడు ఈ హీరో.
ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు మహేష్ బాబు.రష్మిక మందన్న హీరోయిన్ కాగా.
విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ లక్షణాలు ఉంటే మీ ఫోన్ హ్యక్ అయినట్లే..