మహేష్ బాబు హరీష్ శంకర్ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

అందులో హరీష్ శంకర్( Harish Shankar ) ఒకడు.ఎందుకంటే ఈయన గబ్బర్ సింగ్( Gabbar Singh ) లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాను తీసిన తర్వాత ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆ తర్వాత 'రామయ్య వస్తావయ్య' సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు.ఇక గబ్బర్ సింగ్ తో ఎంత మంచి గుర్తింపు వచ్చిందో రామయ్య వస్తావయ్య తో అదంతా పోయి నార్మల్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఇక ప్రస్తుతం ఆయన సినిమాలను రీమేక్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీగా ఆడుతున్నాయి.

"""/" / అయితే హరీష్ శంకర్ మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో చాలా రోజుల నుంచి ఒక సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కానీ అది మాత్రం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.ఇక మొత్తానికైతే మహేష్ బాబు హరీష్ శంకర్ కాంబో లో సినిమా కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా( Mr Bachchan ) సక్సెస్ అయితే మహేష్ బాబు తనకు డేట్స్ ఇవ్వచ్చు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

కానీ ప్రస్తుతం ఆయన రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

కాబట్టి ఇప్పుడప్పుడే ఆ సినిమా నుంచి బయటికి వచ్చే అవకాశాలు అయితే లేవు.

"""/" / దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఆ సినిమాకి స్టిక్ అయిపోవాల్సిన అవసరం అయితే ఉంది.

కాబట్టి ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ కి మహేష్ బాబు డేట్స్ ఎలా ఇస్తాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఇంతకుముందే వీళ్ళు కాంబినేషన్ లో సినిమా రావాల్సింది.కానీ అది అనుకొని కారణాల వల్ల ఆగిపోయింది.

మధుమేహం ఉన్న‌వారు నెయ్యి తినవచ్చా..?