Guntur Kaaram OTT : అఫీషియల్: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం గుంటూరు కారం( Gunturu Kaaram ) ఈ సినిమా జనవరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా మిక్స్డ్  టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకుంది.

మహేష్ బాబు మీనాక్షి చౌదరి శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

"""/"/ ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్( Netflix)కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుతో పాటు మలయాళ హిందీ కన్నడ భాష హక్కులను కూడా కొనుగోలు చేశారు.

థియేటర్లో జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా నెలరోజులు కూడా కాకుండానే ఓటీటీలో( Gunturu Kaaram OTT ) ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.

ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారానికి సిద్ధమైంది.

"""/"/ ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు.

మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో నటించినటువంటి ఈ సినిమా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం.

ఇక ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే.

ఇటీవల ఈ పాట ఫుల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

గుంటూరు కారం సినిమా పూర్తి కావడంతో మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli )సినిమా పనులలో బిజీ అయ్యారు.

తనపై 8 సార్లు కొరడా ఝులిపించుకున్న అన్నామలై..