గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ”ఓ మై బేబీ”కు టైం ఫిక్స్.. ప్రోమో ఎప్పుడంటే?
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) నుండి నెక్స్ట్ రాబోతున్న మూవీ ''గుంటూరు కారం''.
మాస్ మసాలా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియెన్స్ మొత్తం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా కోసం ఆడియెన్స్ లో భారీ హైప్ నెలకొంది.
మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''( Guntur Karam ).
మరో నెల రోజుల్లో సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. """/" /
ఈ క్రమంలోనే ఇటీవలే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ ఇచ్చారు.
ఎప్పుడెప్పుడా అని ఈ సాంగ్ కోసం అంత ఎదురు చూస్తుండగా కొద్దిసేపటి క్రితం పోస్టర్ తో రివీల్ చేశారు.
''ఓ మై బేబీ'' అంటూ సాగే ఈ సాంగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు ప్రోమో రిలీజ్ చేయనున్నారు.
"""/" /
అలాగే ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
ఎట్టకేలకు సాంగ్ అప్డేట్ రావడంతో ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.మహేష్, శ్రీలీలపై రొమాంటిక్ సాంగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ న్యూస్ విని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల,( Sreeleela ) మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.