‘గుంటూరు కారం’ చిత్రాన్ని చుట్టేస్తున్నారా..? సంక్రాంతి రిలీజ్ కోసం ఇన్ని తిప్పలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం గా 'గుంటూరు కారం' నిలుస్తుందని చెప్పొచ్చు.

ఎందుకంటే వరుస సూపర్ హిట్స్ తో ఉన్న మహేష్ బాబు,'అలా వైకుంఠపురం లో'( Ala Vaikunthapuramloo ) వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అంతే కాదు షూటింగ్ దశలో ఉన్నప్పుడే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ముగిసిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 160 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం.

అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడం తో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

ఒక షెడ్యూల్ ప్రారంభం అవ్వడం , వెంటనే ఎదో ఒకటి అడ్డు రావడం ఆగిపోవడం, మహేష్ బాబు ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లడం, ఇవి తరచూ జరుగుతూ ఉండేవి.

"""/"/ ఎట్టకేలకు అవాంతరాలు అన్నీ ఛేదించుకొని రీసెంట్ గానే అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ) లో ఒక షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.

ఈ షెడ్యూల్( Guntur Karam Shooting ) లో ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఆరు రోజులు ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తే కేవలం మూడు రోజుల్లోనే అవగొట్టేసారు.

దీనిని చూసి అభిమానులు సినిమాని ఇలాగే చుట్టేస్తున్నారా?, ఔట్పుట్ ని పట్టించుకోవడం లేదా అని సోషల్ మీడియా( Social Media ) లో మేకర్స్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.

కానీ మేకర్స్ మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదు, మహేష్ బాబు కెరీర్ లోనే ఈ చిత్రం మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నారు.

ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీకి వచ్చినా, గుంటూరు కారం( Guntur Karam ) మేనియా ముందు నిలబడలేవని, ఈసారి మహేష్ బాబు కొట్టబోయే దెబ్బ మామూలు రేంజ్ లో ఉండదని అంటున్నారు.

నవంబర్ నెలాఖరు లోపు షూటింగ్ ని పూర్తి చేసి, జనవరి 12 వ తారీఖున ఎట్టి పరిస్థితిలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు.

"""/"/ ఆర్టిస్టుల డేట్స్ విషయం లో ఏదైనా సమస్య వస్తే దూప్స్ ని పెట్టి లాగించేస్తున్నారట.

రీసెంట్ గానే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల( Actress Sreeleela ) డేట్స్ లేకపోవడం తో ఆమె స్థానం లోకి డూప్ ని పెట్టి తీసారట.

ఇది సోషల్ మీడియా లో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.అలాగే రమ్య కృష్ణ డేట్స్ కూడా ఇబ్బంది రావడం తో మహేష్ బాబు స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఆమె డేట్స్ ని రప్పించుకున్నారట.

ఇలా మూవీ కి సంబంధించి ఏ విషయం లో కూడా తగ్గకుండా, ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి( Sankranti )కి వచ్చేలాగా పట్టుదలతో షూటింగ్ ని చేస్తున్నారట.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!