మహేష్ తో యాక్షన్.. గన్స్, కత్తులతో భారీ సీక్వెన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరి మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''.

( Guntur Karam ) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.

ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబో రెండుసార్లు రాగా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి రాబోతుంది.

దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి తర్వాత షూట్ స్టార్ట్ చేసుకున్న ఏదొక అడ్డుతో కనీసం సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేక పోయింది.

అయితే గత నెల రోజుల నుండి మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపు తున్నారు.

"""/" / ప్రజెంట్ చాలా వేగంగా షూట్ జరుగుతుండగా ఈ సినిమా షూట్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

టీమ్ ఇప్పుడు ఒక క్రేజీ యాక్షన్ షూట్ లో బిజీగా ఉంది.గన్స్ అండ్ కత్తులతో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు( Ram Laxman Masters ) డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ 10 రోజులుగా షూటింగ్ జరుపు కుంటుంది.

మహేష్ తో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తుండగా అవుట్ పుట్ కూడా బాగా వచ్చిందని తెలుస్తుంది.

"""/" / త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తో ( Trivikram ) ఈసారి గుంటూరు కారం మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

తెలుగువారని అవమానించలేదన్న కస్తూరి.. ఆమె వివరణతో తెలుగు వాళ్లు కూల్ అవుతారా?