ఆ విషయం లో పూర్తి ఫ్రీడం రాజమౌళికే ఇచ్చిన మహేష్ బాబు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.
( Rajamouli ) ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడుగా కూడా ఎదిగాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
మహేష్ బాబు ను( Mahesh Babu ) హీరోగా పెట్టి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది.
"""/" /
ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే దానిమీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబు తో ఈ సినిమాకి సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయితే మహేష్ మేకోవర్( Mahesh Makeover ) సంబంధించి ఆయన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రాజమౌళి ఎలా చెప్తే అలా వింటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక రాజమౌళి సపరేట్ గా కొన్ని స్కెచ్ వేయించి మరి వాటి ద్వారా మహేష్ బాబు లుక్కుని డిజైన్ చేసి అలాంటి షేప్ లోకి మహేష్ బాబుని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.
"""/" /
ఇక ఆల్మోస్ట్ మేకోవర్ కు సంబంధించిన పనులు పూర్తి చేసినప్పటికీ మహేష్ బాబు కి సిక్స్ ప్యాక్( Mahesh Babu Six Pack ) వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలో కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించలేదు.
మరి ఈ సినిమాలో కనిపించాలని రాజమౌళి చెప్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దానికి కూడా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సిక్స్ ప్యాక్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట.
చూడాలి మరి ఈ సినిమాలో అయిన మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తాడా లేదా అనేది.
చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది.
కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..