రాజకీయాల్లోకి రావాలని కోరిన అభిమానులు.. సూపర్ స్టార్ మహేష్ రియాక్షన్ ఇదే!
TeluguStop.com
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Superstar Mahesh Babu )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరో మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అదేమిటంటే.సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఇప్పటికే చాలామంది రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
"""/" /
సీనియర్ నటుడు హీరో నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) నుంచి ఇప్పటివరకు ఎంతమంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంత ఇచ్చే సక్సెస్ అయ్యారు.
ఇక ప్రస్తుతం ఉన్నవారిలో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్న విషయం తెలిసిందే.
అలాగే తమిళ హీరో విజయ్ దళపతి కూడా ఇటీవల పాలిటిక్స్ ( Politics )లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే చాలా కాలంగా మహేష్ బాబు కూడా రాజకీయాలలోకి రావాలి అన్న డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి చిత్రాలు రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ కూడా జరిగింది.
కానీ అలాంటి వార్తలపై మహేష్ బాబు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనకు పాలిటిక్స్ పై ఆసక్తి లేదని చెబుతూనే ఉన్నారు.
"""/" /
ఎన్నిసార్లు స్పందించినా కూడా ఈ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వస్తున్నారు.
మీకు పాలిటిక్స్ లోకి వెళ్లే ఆలోచన ఉందా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
నన్ను ఎవరైనా పాలిటిక్స్ లోకి తీసుకువెళితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.నాకు రాజకీయాల గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు అని మహేష్ బాబు అన్నారు.
కానీ కథని బట్టి పొలిటికల్ మూవీస్ మాత్రం చేస్తుంటాను అని మహేష్ బాబు అన్నారు.
మరో మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.మీరు సైనికుడు చిత్రంలో కూడా యువత రాజకీయాల్లోకి రావాలని మెసేజ్ ఇచ్చారు.
కాబట్టి పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన మీరు చేయడం లేదా అని అడిగారు.
మహేష్ బదులిస్తూ.అందుకే ఆ సినిమా ఒక్క వారం మాత్రమే ఆడింది అంటూ తనపైన తానే సెటైర్లు వేసుకున్నారు.
మొత్తంగా చూసుకుంటే మహేష్ బాబుకి పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం లేదని ఇకపై అయినా ఈ వార్తలకు పులి స్టాప్ పడితే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప అన్న కూతురి పాత్రకు కావేరి పేరు పెట్టడం వెనుక ఇంత పెద్ద రీసన్ ఉందా?