చరణ్ మాటలు నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగే.. అసలేం జరిగిందంటే?

మామూలుగా చాలామంది హీరోలు రాజమౌళితో( Rajamouli ) సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతోంది అంటే ఆ హీరో గుర్తింపు దక్కడంతో పాటు ఆ సినిమా హిట్ గ్యారెంటీ అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.

రాజమౌళితో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్‌ అయినా సై అనాల్సిందే.ఆ కాంబినేషన్‌ ఫ్యాన్స్‌కు పండగ.

అయితే హీరో మాత్రం మినిమం మూడేళ్లు మరో పని లేకుండా లాక్‌ అయిపోవాల్సిందే.

జక్కన్నతో సినిమా అంటే మరో మూడేళ్లు అభిమాన హీరో తెరపై కనిపించడనే భయం అభిమానులకు ఉంటుంది.

రాజమౌళితో సినిమాఫిక్స్ అయితే, మినిమం మూడు నాలుగేళ్లు ఆ సినిమాకే అంకితం అయిపోవాలి.

"""/" / పండగలకు, ఇతర సెలబ్రేషన్‌ లకు ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, గ్లింప్స్‌ అంటూ ఏ హడావిడి ఉండదు.

హీరోలు కూడా జక్కన్కన కండీషన్స్‌ కు రెడీ అయిపోతారు.ప్రస్తుతం మహేష్‌ బాబు( Mahesh Babu ) రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇది సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ని సంతోష పెట్టే విషయమే అయినప్పటికీ, ఇప్పుడు మూడేళ్లు మహేశ్‌ జక్కన్న కాంపౌండ్‌ లో లాక్‌ అయిపోయాడనే భయం వాళ్లలో ఉంటుంది.

అయితే తాజాగా రామ్‌ చరణ్‌( Ram Charan ) మాటలు మహేష్‌ అభిమానుల చెవుల్లో అమృతం నింపినట్లయింది.

అన్నీ అనుకొన్నట్టు కుదిరితే.ఏడాదిన్నరలో మహేష్‌ సినిమా వచ్చేస్తుంది అంటూ గేమ్‌ ఛేంజర్‌ ట్రైటర్‌ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ చెప్పారు.

తను తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో తెలీదు కానీ చరణ్‌ మాటలు నిజమైతే సూపర్‌గా ఉంటుంది అంటూ ఫ్యాన్స్‌ దేవుళ్లను మొక్కేస్తున్నారు.

"""/" / ఒకవేళ చెర్రీ చెప్పినట్టు అదే నిజమైతే కనక అభిమానులకు పండగే అని చెప్పాలి.

కానీ రాజమౌళి సినిమా అంటే మనందరికీ తెలిసిందే.ఎంత తొందరగా పని మొదలుపెట్టిన ఎంత నిదానంగా పని మొదలుపెట్టిన సినిమాకు మూడేళ్ల సమయం పట్టడం గ్యారెంటీ.

ఇక ఆ మూడేళ్ల పాటు పడిన శ్రమ అంతా కూడా థియేటర్ల వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ మూడేళ్ల పాటు చెప్పుకునే విధంగా ఉంటుంది.

ఈ సారి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌కి చాలా టైమ్‌ తీసుకున్నారు.ప్రొడక్షన్‌ మాత్రం చక చక పూర్తి చేయాలన్నది ఆయన ప్లాన్‌.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!