మహేష్ బాబు నిజంగానే రూమ్ లోకి వెళ్లి ఏడ్చాడా ?

కృష్ణ ఎంతో ఘనంగా బ్రతికాడు.కానీ ఒంటరి గా కన్ను మూసాడు.

సగటు సామాన్య ఆర్టిస్ట్ కి జరిగినట్టు తూతూ మంత్రంగా మహా ప్రస్థానం లో అంత్యక్రియలను పూర్తి చేసారు.

అయితే కృష్ణ అంత్య క్రియల విషయంలో మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.

మూడవ రోజు చిన్న కర్మ చేసారు.ఇక అస్థికలను కృష్ణ నదిలో కలిపేశారు.

మరి పెద్ద కర్మ పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్ధం కావడం లేదు.ఇప్పటికే పలు మార్లు ఎందుకు కృష్ణ లేదంటే మహేష్ బాబు సొంత స్థలాల్లో అంత్య క్రియలను జరిపించలేదు మరి కాదంటే పద్మాలయ స్టూడియో లో ఎందుకు చేయలేకపోయారు అంటూ చాల ఆర్టికల్స్ ఇప్పటికే వచ్చాయి.

ఇది కేవలం సామాన్యులు లేదంటే అభిమానుల సందిగ్ధం మాత్రమే కాదు.కృష్ణ కుటుంబంలో కూడా ఇదే బాధ అందరికి ఉంది.

ముఖ్యంగా కృష్ణ తమ్ముడు అది శేషగిరి రావు, రమేష్ బాబు భార్య మృదుల ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట.

మరో వైపు వేళా కోట్ల ఆస్తులు, పరిశ్రమలు ఉన్న గళ్ళ జయదేవ్ కుటుంబం మాత్రం ఏమైనా చిన్న కుటుంబమా ? వారు కూడా దీన్ని వ్యతిరేకించారట.

అయితే అందరు ఇలా ముప్పేట అందరు దాడి చేసేవరకు మహేష్ బాబు కోపంగా గదిలోకి వెళ్లి బోరుమన్నట్టుగా తెలుస్తుంది.

అయినా కూడా నిర్ణయాల్లో ఎలాంటి మార్పు జరగకపోవడం విచిత్రం. """/"/ ఇక మహా ప్రష్ఠానం ఐడియా పూర్తిగా మహేష్ బాబు భార్య నమ్రత తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఆమె నిర్ణయం తీసుకోవడం వల్లనే మహేష్ కూడా వ్యతిరేకించ లేదు అనే వార్తలు గట్టిగ వినబడుతున్నాయి.

అసలే గచ్చిబౌలి లో అభిమానులకు చివరి చూపు లేకుండా చేసిన మహేష్ బాబు తన పై వస్తున్న విమర్శలను తట్టుకోలేక మెమోరియల్ అని లేదంటే విగ్రహ ప్రతిష్ట అంటూ కబుర్లు చెప్తే కూడా ఎవరు నమ్మడం లేదు.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేని మహేష్ బాబు ఇలా ఒక్కసారిగా తండ్రి విషయంలో తన నైజాన్ని బయటపెట్టుకోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

పొరపాటున హుండీలో పడిపోయిన భక్తుడి ఐఫోన్.. తిరిగి ఇస్తారనుకుంటే చివరకు?