మహేష్ బాబు తరచూ వెకేషన్ వెళ్లేది అందుకేనా… అసలు విషయం చెప్పిన హీరో?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మహేష్ బాబు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చినటువంటి ఈయన గుంటూరు కారం ప్రమోషన్లలో బిజీ అయ్యారు.

ఇక మహేష్ బాబు సంవత్సరంలో దాదాపు మూడుసార్లు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడం మనం గమనిస్తూ ఉంటాము ఈయనకు ఏమాత్రం విరామం దొరికిన వెకేషన్ వెళ్ళిపోతూ ఉంటారు.

"""/" / తాజాగా ఇదే విషయమే ఒక ఇంటర్వ్యూలో ఈయనకు ఎదురయింది.మీరు తరచూ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడం వెనుక కారణం ఏంటి అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ నాకు నా ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేయడం ఇష్టం కానీ ఇండియాలో నేను బయట అలా తిరగలేను అందుకే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేస్తుంటానని ఈయన తెలిపారు.

నాకు యూరప్( Europe ) అంటే చాలా ఇష్టమని మహేష్ బాబు తెలిపారు.

"""/" / ఇలా ఒకసారి ట్రిప్ వెళ్లి వచ్చిన తర్వాత నేను రీఛార్జ్ అయిన ఫీలింగ్ నాలో కలుగుతుంది చాలా సంతోషంగా ఉంటుందని మహేష్ బాబు తెలిపారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అనే ప్రశ్న కూడా మహేష్ బాబుకి ఎదురు కావడంతో నేనెప్పుడూ సరదాగా ఉండటమే కాకుండా నవ్వుతూ ఉంటాను అదే నా గ్లామర్ సీక్రెట్ అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు తన వ్యక్తిగత విషయాలను తెలియజేశారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఎయిరిండియా ఫ్లైట్ 182పై బాంబు దాడికి 39 ఏళ్లు : దర్యాప్తు జరుగుతోందన్న కెనడా పోలీసులు