నమ్రత ఫోటోషూట్ పై కామెంట్స్ చేసిన మహేష్..!

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ పెయిర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే దంపతులు మహేష్ బాబు.

నమ్రత శిరోద్కర్.వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

నమ్రత పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి తన భర్తను, పిల్లలను చూసుకుంటూ పర్ఫెక్ట్ వైఫ్ గా అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

మహేష్ బాబుకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ ఉంటుంది.మహేష్ బాబు, నమ్రత ఇద్దరు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు.

నమ్రత ఎప్పటికప్పుడు తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ అందరికి దగ్గరగా ఉంటుంది.

అయితే తాజాగా మహేష్ తన భార్య నమ్రత ఫోటో షూట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఈ ఫోటోలను ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరికేర్ తీసాడు.అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఇవి న లైఫ్ లోనే ప్రత్యేకమైనవి అని నమ్రత ఫోటోలను షేర్ చేసాడు.

"""/"/ అయితే ఈ ఫోటోలను చూసిన మహేష్ స్పందించాడు.పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ నమ్రత ఫోటోలపై మహేష్ కామెంట్స్ చేసాడు.

ప్రస్తుతం నమ్రత ఫోటోలతో పాటు మహేష్ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చుసిన మహేష్ అభిమానులు కూడా నమ్రత ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

"""/"/ ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇక ఈ మధ్యనే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టు కోవడమే కాకుండా ఈ సినిమాపై కూడా అంచనాలు పెంచింది.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బిగ్ బాస్ షో వల్లే నా పేరు నాశనం.. తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు వైరల్!