Mahesh Babu : నా కెరీర్ ను మలుపు తిప్పిన మూడు సినిమాలు ఇవే.. మహేష్ కు నచ్చిన ఆ మూడు సినిమాలు ఏంటంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గత కొన్నేళ్లుగా నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం మూవీ( Guntur Kaaram ) కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది.

ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి.

అయితే తాజాగా మహేష్ బాబు ఒక సందర్భంలో మూడు సినిమాలు తన కెరీర్ ను మలుపు తిప్పాయని వెల్లడించారు.

మురారి, పోకిరి, శ్రీమంతుడు సినిమాలు( Murari Pokiri Srimanthudu ) నా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు అని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

ఈ మూడు సినిమాలు నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయని ఆయన అన్నారు.

ప్రేక్షకులను మెప్పించే, నైతిక అంశాలు ఉండే కథలను ఎంపిక చేసుకుంటూ వస్తానని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు.

ఇన్నేళ్ల కెరీర్ లో సక్సెస్ కావడంపై నా ఒపీనియన్ కూడా మారిందని ఆయన తెలిపారు.

"""/"/ ఒక సినిమా సక్సెస్ సాధించడానికి బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత ముఖ్యమో ఆ మూవీ ఆడియన్స్( Audience ) పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది అంతే ముఖ్యమని మహేష్ బాబు తెలిపారు.

ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ సినిమాలోని పాత్రకు లొంగిపోతానని ఆయన అన్నారు.

డైరెక్టర్ చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతానని మహేష్ బాబు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

""img Src= ఈ జనరేషన్ ప్రేక్షకులు ఏదో రైటో ఏది రాంగో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నానని మహేష్ బాబు అన్నారు.

రాజమౌళి( Rajamouli ) సార్ తో నేను నటించే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మంచిగా జరుగుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు.

షూటింగ్ లో పాల్గొనడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మహేష్ బాబు తెలిపారు.మహేష్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది.

బాలయ్య బాబీ కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లా.. క్లైమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ప్లాన్ చేశారా?