యశోద హాస్పిటల్ ముందు మహేష్ కేరవాన్…. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావాల్సి ఉండగా మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు.ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు సమాచారం.

ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు కేరవాన్, హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ ముందు ఉండడంతో అభిమానులు ఒక్కింత ఆందోళన చెందిన, కేవలం సినిమా షూటింగ్ పనుల నిమిత్తమే మహేష్ కేరవాన్ యశోద హాస్పిటల్ ముందు ఉందని తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో కొన్ని హాస్పిటల్ సన్ని వేషాలు ఉండడంతోనే ప్రస్తుతం ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

"""/" / ఈ షూటింగ్లో భాగంగా నటి పూజా హెగ్డే కూడా పాల్గొన్నట్టు సమాచారం.

ఇలా హాస్పిటల్ సన్ని వేషాలను చిత్రీకరించడం కోసమే చిత్ర బృందం యశోద హాస్పిటల్ వద్దకు చేరుకున్నారని ఈ క్రమంలోనే మహేష్ బాబు కేరవాన్ కూడా అక్కడే ఉందని తెలుస్తోంది.

ఇలా హాస్పిటల్ సన్ని వేషాలు చిత్రీకరిస్తున్నారని తెలియగానే త్రివిక్రమ్ ఎప్పటిలాగే """/" / తన పాత ధోరణిలో సినిమా చేస్తున్నారని మహేష్ సినిమాలో కూడా హాస్పిటల్ సన్నివేశాలను పెడుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సుమారు 11 సంవత్సరాలు తర్వాత సినిమా రావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అతడు ఖలేజా సినిమాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాని ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?