మహేష్ బాబు కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.
ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానుంది.త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ స్థాయిలోనే అంచనాలు కూడా ఉన్నాయి.
"""/" /
గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో రాజమౌళి ఎంతో బిజీగా ఉన్నారు.
గుంటూరు కారం విడుదల కాగానే మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పాల్గొనబోతున్నారు.ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
ముఖ్యంగా మహేష్ బాబు పర్సనల్ కార్ డ్రైవర్ శాలరీ గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
మహేష్ బాబు తన వ్యక్తిగత కారు డ్రైవర్ ( Car Driver ) కి నెలకు 5 లక్షల రూపాయల శాలరీ ఇస్తారని తెలుస్తుంది.
ఈయన కేవలం మహేష్ బాబుకి మాత్రమే కాకుండా నమ్రతకు( Namrata ) కూడా వ్యక్తిగత డ్రైవర్ గా పని చేస్తున్నారట.
దీంతో ఈయనకు నెలకు 5 లక్షల రూపాయల జీతం చెల్లిస్తున్నారు అంటూ ఒక వార్త సంచలనంగా మారింది.
ఇలా నెలకు 5 లక్షల రూపాయల జీతం అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగికి కూడా ఈ స్థాయిలో సాలరీ ఇవ్వరని చెప్పాలి.
ఇక కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో రాంచరణ్ ,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా వారి డ్రైవర్లకు ఇదే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
ఏది ఏమైనా కారు డ్రైవర్ నెల జీతం ఐదు లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి.
నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా