బర్త్ డే సందర్భంగా ‘SSMB28’ లాంచింగ్ అప్డేట్.. స్టార్ట్ అయ్యేది అప్పుడే!
TeluguStop.com
మన తెలుగు వారు ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
మరి అలాంటి స్టార్ నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.ఈయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు.
మహేష్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.మరి మన టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
అలాగే ఈయన పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కోసం మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలైనా పోకిరి, ఒక్కడు సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ స్పెషల్ షోలకు సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది.ఇక ఇది ఇలా ఉండగా మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు.SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.తాజాగా ఈ రోజు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా SSMB28 నుండి ఒక అప్డేట్ ప్రకటించారు మేకర్స్.
మహేష్ బాబుకు విషెష్ చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.''బహుముఖ నటన నైపుణ్యం.
అయస్కాంత శక్తి.మనోహర వ్యక్తిత్వం ఉన్న మహేష్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
SSMB28 షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.అంటూ బర్త్ డే విషెష్ తో ఉన్న మహేష్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
"""/"/
ఇక 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
చూడాలి ఈ నెలలో ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందో.