చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు… సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతూ ఉంటాయి.

అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేశాయి.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki  vastunnam) సినిమా ఒకటి.

డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh ) , మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల అయింది.

"""/" / ఇలా ఈ సినిమా మొదటి రోజు నుంచి ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ మంచి సక్సెస్ అందుతుంది.

ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పాల్గొని సందడి చేశారు.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / ఇలా సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందంతో మహేష్ బాబు పాల్గొనడంతో అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ చిన్నోడితో పెద్దోడి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ ఆయన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ప్రత్యేకంగా  అభినందనలు తెలియజేస్తూ పోస్ట్ చేసారు.

ఇక అనిల్ రావిపూడి వెంకటేష్ తో మహేష్ బాబుకి(Mahesh Babu With Anil Ravipudi Venkatesh) ఉన్న అనుబంధం నేపథ్యంలోనే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారని తెలుస్తుంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు.ఇక వెంకటేష్ తో కలిసి ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?