దిల్ రాజు కొడుకు బర్త్ డే వేడుకలో మహేష్, సితార.. పిక్ అదిరిందిగా!

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మంచి విజయం సాధించాడు.

ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు.

అందుకే దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నాడు అంటే అది పక్కా హిట్ అనే ముద్ర పడిపోయింది.

దిల్ రాజు గతంలో అన్ని మీడియం బడ్జెట్ తోనే సినిమాలు తీసి మంచి లాభాలు అందుకునే వాడు.

ఈ మధ్య మన టాలీవుడ్ లెక్కలు మారడంతో దిల్ రాజు కూడా రంగంలోకి దిగాడు.

ఈయన కూడా హై బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సిద్ధం అయ్యాడు.అయితే కెరీర్ లో దిల్ రాజు సక్సెస్ ఫుల్ గా సాగుతుండగానే.

ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నాడు. """/" / ఈయన కొన్నాళ్ల క్రితమే రెండవ పెళ్లి చేసుకున్న విషయం విదితమే.

మొదటి భార్య అనిత మరణించడంతో రెండవ వివాహం చేసుకున్నారు.వీరికి గత ఏడాది జూన్ 29న కొడుకు పుట్టిన విషయం తెలిసిందే.

అన్వీ రెడ్డి అనే పేరు పెట్టుకున్న దిల్ రాజు ఈ తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. """/" / హైదరాబాద్ లోని జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో కుమారుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

టాలీవుడ్ అతిరధ మహారధులను ఆహ్వానించగా అందరు కూడా దిల్ రాజు కొడుకు బర్త్ డే వేడుకలో పాల్గొన్నారు.

వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కూతురు సితార కూడా ఉన్నారు.

వీరిద్దరూ కలిసి ఆ వేడుకలో దిగిన సూపర్ కూల్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇద్దరు వైట్ కలర్ డ్రెస్ లో కూల్ గా చిరునవ్వులు చిందిస్తున్న ఈ పిక్ మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ అయ్యింది.

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!