ఇక బాబు వంతు.. పది రోజుల్లో టాలీవుడ్‌కు మరో పండుగ

టాలీవుడ్‌ లో నేడు అంతా కూడా ఎన్టీఆర్‌ పుట్టిన రోజు అవ్వడంతో సందడి వాతావరణం నెలకొంది.

ఆర్ ఆర్‌ ఆర్‌ పోస్టర్ విడుదల కొరటాల శివ సినిమా గురించిన విషయాలతో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 31 సినిమా అధికారిక ప్రకటనతో మొత్తం రచ్చ రచ్చగా వ్యవహారం ఉంది.

ఉదయం మొదలయ్యి రాత్రి పొద్దుపోయే వరకు ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంటుంది.ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులు కూడా సందడి చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ సినిమా కు సంబంధించిన అప్ డేట్స్ రావడంతో ఇక తదుపరి రాబోతున్న మహేష్ బాబు సినిమా లకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మహేష్ బాబు తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న సందడి వాతావరణం ఉంటుంది.

ఎందుకంటే ఆ రోజున మహేష్‌ బాబు సినిమా లకు సంబంధించిన అప్ డేట్స్ రాబోతున్నాయి.

ముఖ్యంగా మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కు టీజర్ ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

అందుకు సంబంధించిన కట్టింగ్స్ ను కూడా చేశారు.త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఇదే సమయంలో మహేష్‌బాబు తో త్రివిక్రమ్‌ చేయబోతున్న సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడంతో పాటు టైటిల్‌ ను కూడా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమా ప్రారంభం ఎప్పుడు అనే విషయాన్ని త్రివిక్రమ్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మే 31 న మరో టాలీవుడ్ పండుగ రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఫుల్‌ ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

 మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా కు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు.ఇక త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా ను సమ్మర్ లో విడుదల చేయబోతున్నారట.

“ఆచార్య”కి ముందు చిరంజీవి కెరీర్‌లోనే ది వరస్ట్ సినిమాలు అంటే ఇవే!