మహేష్‌, త్రివిక్రమ్‌ మూవీ… కృష్ణ మృతితో మరింతగా మార్పులు?

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ఈ ఏడాది ఇప్పటికే సర్కారు వారి పాట వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో తదుపరి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

పైగా తదుపరి సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్నాడు.

వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చ పుష్కర కాలం అయ్యింది.అతడు మరియు ఖలేజా సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోలేదు.

ఆ లోటును ఇప్పుడు ఈ సినిమా తో మహేష్‌ బాబు కు త్రివిక్రమ్‌ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబో సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా విడుదల అవ్వాల్సి ఉంది.

కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత స్క్రిప్ట్‌ వర్క్‌ మళ్లీ చేశారు అని.

సినిమా యొక్క కథ మరియు మహేష్‌ బాబు యొక్క పాత్రలో చాలా మార్పులు చేర్పులు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు యొక్క తల్లి ఇందిరా దేవి చనిపోయిన సమయంలో కాస్త ఎక్కువ సమయం త్రివిక్రమ్‌ కు లభించింది.

ఆ సమయంలో సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్‌ ను మళ్లీ చేస్తున్నారని.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు మళ్లీ మొదలు పెట్టాలని భావించినప్పటికి కృష్ణ మృతి చెందారు.

దాంతో మళ్లీ షూటింగ్‌ కు ఆలస్యం అవుతుంది. """/"/ ఈ సమయంలో షూటింగ్‌ కు మళ్లీ సమయం లభించడం తో దర్శకుడు త్రివిక్రమ్‌ కథ ను మళ్లీ మొదటి నుండి రెడీ చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.ఇప్పుడు కథ ను మళ్లీ మొదలు పెడితే పరిస్థితి ఏంటీ అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ సమయంలోనే కృష్ణ మృతి నుండి కోలుకుని మహేష్ బాబు ఎప్పటి నుండి షూటింగ్‌ లో జాయిన్ అవుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.