సంక్రాంతికి గుంటూరు కారం.. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా ( Gunturu Karam Movie )షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పూర్తి అవ్వలేదు.

డిసెంబర్ లో సినిమా షూటింగ్‌ పూర్తి అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు.

కనుక సినిమా ను సంక్రాంతికి విడుదల చేయరేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

కానీ తాజాగా నిర్మాత నాగ వంశీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.

ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి గుంటూరు కారం సినిమాను సంక్రాంతికి తీసుకు వస్తాము అంటూ ప్రకటించాడు.

అయితే ఇతర సినిమా ల పోటీ ఉంది కదా. """/" / ఆ సినిమా ల నిర్మాతలతో ఏమైనా మాట్లాడుతారా అంటూ మీడియా వారు ప్రశ్నించగా.

ప్రేక్షకులు మహేష్ బాబు ( Mahesh Babu )గుంటూరు కారం సినిమాను చూడాలని కోరుకుంటూ ఉండగా ఇతర నిర్మాతలతో మేము మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

నిర్మాత నాగ వంశీ మాటలను చూస్తూ ఉంటే కచ్చితంగా గుంటూరు కారం సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

అంతే కాకుండా ఈ నెలలోనే సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయాలని భావిస్తున్నారు.

"""/" / డిసెంబర్‌ రెండవ లేదా మూడవ వారంకు సినిమా యొక్క ఫస్ట్‌ కాపీ రెడీ అవ్వబోతుంది అన్నట్లుగా నిర్మాత చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఈ సినిమా తో పాటు సితార ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ లో చాలా సినిమాలు వస్తున్నాయి.

అందులో కొన్ని సినిమాలు చిన్న బడ్జెట్‌ సినిమా లు కాగా, కొన్ని పెద్ద బడ్జెట్‌ సినిమాలు నిర్మాత నాగ వంశీ ( Naga Vamsi )తాజాగా ఆదికేశవ సినిమా( Adikeshava ) ను నిర్మిస్తున్నాడు.

ఆ సినిమా కు సంబంధించిన విషయాలను పంచుకోవడానికి మీడియా ముందుకు వచ్చి గుంటూరు కారం గురించి కూడా స్పందించాడు.