Sitara : అభిమానులను రిక్వెస్ట్ చేసిన మహేష్, సితార.. కుక్కను దత్తత తీసుకోవాలంటూ?
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు>( Mahesh Babu ) ముద్దుల కూతురు సితార( Sitara ) ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చిన్న వయసులోనే భారీగా అభిమానులను సంపాదించుకోవడంతోపాటు సేవాగుణంలో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.
సితార కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
సోషల్ మీడియాలో వరుసగా ఫోటోసుట్లు డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను మరింత పెంచుకుంటోంది.
తండ్రి బాటలోనే కూతురు నడుస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది.మహేష్ ( Mahesh Babu )మంచితనమే సితారకు వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
ఇకపోతే ఇటీవల సితార ( Sitara )ఒక జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా యాడ్ కూడా చేసిన విషయం తెలిసిందే.
ఈ యాడ్ తో ఒక్కసారిగా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఈ ప్రకటనకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తానికి మహేష్ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చింది.
అంతేకాకుండా తన బర్త్ డేకు కొందరు విద్యార్థినీలకు సైకిల్స్ ని బహుమతిగా అందించింది.
అలాగే ఇటీవల ఒక ఈవెంట్లో పెద్దావిడను చేయి పట్టుకుని స్టేజ్ మీదకు తీసుకెళ్లడం ఆ తర్వాత అందరితో ప్రేమగా మాట్లాడటం, సెల్ఫీలు దిగడం చూసి సీతూపాప మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సితార అభిమానులను స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.ప్రతి ఒక్కరూ ఓ వీధి కుక్కను దత్తత తీసుకోవాలని కోరింది.
"""/" /
కొద్ది రోజుల క్రితం సితార( Sitara )కు ఇష్టమైన పెట్ ఫ్లూటో మరణించడంతో చాలా కుంగిపోయింది సితార.
ఫ్లూటో మరణంతో మహేష్ సైతం చాలా బాధపడ్డాడు.ఫ్లూటో మరణించిన కొన్ని రోజులకే స్నూపీని తీసుకువచ్చారు.
తాజాగా తన పెట్ స్నూపీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా సితార వేసిన పోస్ట్ నెట్టంట వైరలవుతుంది.
మనుషులకు ప్రేమ గురించి పెట్స్ నేర్పుతాయి.బ్లూక్రాస్ యానిమల్ షెల్టర్ సంస్థ స్నూపీని రెస్క్యూ చేసింది.
అక్కడి నుంచే మా జీవితాల్లోకి స్నూపీ వచ్చింది.మాకు ఎంతో ప్రేమను, బంధాన్ని పంచుతోంది.
ఆపదలో ఉన్న వీధి కుక్కలను ప్రతి ఒక్కరూ దత్తత తీసుకోవాలని కోరుతున్నాను.బయట ఇలాంటి స్నూపీలు చాలా ఉన్నాయి.
వాటికి ఒక కొత్త జీవితాన్ని ఇస్తారని ఎదురుచూస్తున్నాయి.మీరు ఎప్పుడైనా కుక్కను కాపాడితే నేను వాటిని చూడాలనుకుంటున్నాను.
వాటి ఫోటోస్ స్టోరీలో పెట్టి నన్ను ట్యాగ్ చేయండి అంటూ రాసుకొచ్చింది సితార.
ఇక మహేష్ సైతం దత్తత తీసుకోండి.స్నూపీ వచ్చిన తర్వాత రోజూ మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి అంటూ స్నూపీ ఫోటో షేర్ చేశారు.
అందుకు సంబంధించిన పోస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.