స్టైలిష్ లుక్‌లో స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రత..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

ఈయన సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు షూటింగ్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడుతన కుటుంబాన్ని కూడా వెంట తీసుకు వెళ్లడం లేదా షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లడం చేస్తుంటారు.

ఇలా సినిమాల పరంగా బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతుంటారు.

ఇకపోతే మహేష్ బాబు నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికిన నమ్రత పిల్లల బాధ్యతలను చూసుకుంటూ, మహేష్ సినిమాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నారు.

"""/"/ ఇకపోతే మహేష్ బాబు తాజాగా ఒక ఫోటో షూట్ జరుపుతున్నట్లు సమాచారం.

మహేష్ బాబు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు తన కుటుంబ సభ్యులతో కలిసి యాడ్స్ లో పాల్గొంటారు.

తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ హలో కోసం వీరిద్దరూ స్టైలిష్ లుక్ లో ఫోటో షూట్ లో పాల్గొన్నారని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన మ్యాగజైన్ కవర్ పేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది సూపర్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ట్రంప్‌‌పై హత్యాయత్నం: దుండగుడు వాడిన ఆయుధంపై చర్చ , ‘‘ ఏఆర్-15 రైఫిల్ ’’ ఎందుకంత డేంజర్