హిస్టారికల్ కథకు మహేష్ నో..?
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో తెరకెక్కించాల్సి ఉన్నా, అది కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
దీంతో పలువురు దర్శకుల కథలను ఆయన విన్నారు.ఈ క్రమంలో మహేష్ ఓ యంగ్ డైరెక్ట్ చెప్పిన కథకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి, ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.
పూర్తి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించి టాలీవుడ్‌ను షేక్ చేశాడు.
అయితే మహేష్ బాబు కోసం అజయ్ భూపతి ఓ హిస్టారికల్ కథను రెడీ చేసి ఆయనకు ఇటీవల వినిపించాడు.
కానీ అలాంటి కథలు తనకు సెట్ కావని భావించిన మహేష్, అజయ్ భూపతికి నో చెప్పాడు.
దీంతో అజయ్ భూపతి బాగా హర్ట్ అయ్యాడట.అందుకే ఇటీవల మహేష్ బాబుపై కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
మరి మహేష్ రిజెక్ట్ చేసిన ఆ హిస్టారికల్ కథను అజయ్ భూపతి ఎవరితో తెరకెక్కిస్తాడో చూడాలి.
కాగా మహేష్ తన నెక్ట్స్ మూవీని పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసపై సిట్ ఏర్పాటు..!!