ఆమె నాకు గొప్ప స్నేహితురాలు : హీరో మహేష్ బాబు

హీరో మహేష్ బాబు.( Mahesh Babu ).

ఈయన ఒక తెలిసిన పుస్తకం.జీవితంలో ఎలాంటి చెడు అలవాట్లు లేదా హీరోయిన్స్ తో ఎఫైర్స్ వంటివి పెట్టుకోకుండా చాలా తక్కువ మంది హీరోలలో మహేష్ బాబు ముందు వరసలో ఉంటాడు.

కృష్ణ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు.

ఆయన వంశీ సినిమాలో ( Vamsi Movie )తనతో పాటు నటించిన హీరోయిన్ నమ్రత శిరోద్కర్ </emని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

నమ్రత( Namratha ) వచ్చిన తర్వాత మహేష్ బాబు జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

"""/" / ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుని మీ స్నేహితుల గురించి చెప్పమంటే కేవలం నా భార్య మాత్రమే నాకు ఒక గొప్ప స్నేహితురాలు.

నేను బయట ఎవరితో పెద్దగా కలవలేను.ఒకసారి కలిసాన వారితో చాలా ఓపెన్ అయిపోయి ఉంటాను.

కానీ అలా చాలా తక్కువ సందర్భంలోనే జరుగుతుంది.నమ్రత నా జీవితంలో కి వచ్చిన తర్వాత నా ప్రపంచం అద్భుతంగా మారిపోయింది.

నాకు బంగారం లాంటి ఇద్దరు పిల్లలను బహుమతిగా ఇచ్చింది.సినిమాలకు సంబంధించిన విషయాలను, ఆర్థిక విషయాలను, బ్రాండ్ ప్రమోషన్స్ కి సంబంధించిన విషయాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటుంది.

"""/" / అందువల్లే నేను సినిమాపై పూర్తి ఫోకస్ చేయగలను.ఏదైనా సినిమా నిర్మించాలన్నా కూడా అందులో నమ్రత నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి.

కథ విషయంలోనూ సినిమాకి సంబంధించిన బడ్జెట్ విషయంలోనూ నమ్రత ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుంటుంది.

నాకన్నా కూడా నమ్రత ఎంతో తెలివైనది.అందుకే కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది.

అలాగే నా కుటుంబ సభ్యులకు పెళ్లయిన కొత్తలో పెద్దగా నచ్చకపోయినా ఇప్పుడు ఆమె నాకన్నా కూడా వారితో స్నేహంగా ఉంటుంది.

అందరిని కలుపుకొని ముందుకు వెళుతుంది ప్రస్తుతం అందరికీ ఆమెనే ఇంట్లో గొప్ప ఫ్రెండ్ గా ఉంది.

ఎన్టీఆర్ కొత్త సినిమాకు మెగాస్టార్ టైటిల్ ఫిక్స్ అయిందా.. అసలేం జరిగిందంటే?